సూర్య దిన పత్రిక డైరీని ఆవిష్కరించిన మంత్రి ఎన్. నిరంజన్ రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 23, 2021, 05:06 PM
 

వనపర్తి: ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఒకటైనా సూర్య దినపత్రిక డైరీ ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం తన నివాసంలో ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వార్త పత్రికలు ప్రజల కు సమాచారం అందించి సమాజంలో  ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడం కీలకపాత్ర పోషిస్తాయని, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రజలకు చైతన్య పరచడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు ఎక్కడైనా అవినీతి జరిగితే దాన్ని బయటికి తీసి ప్రజల ముందు నిలిపే పాత్రను పత్రికలు పోషించాలని, ఈ విధంగా సూర్య దినపత్రికకు అపారమైన అనుభవం ఉన్నట్లు తాను విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సూర్య దినపత్రిక జిల్లా బ్యూరో డి . మాధవరావు, రిపోర్టర్లు కె. రవికుమార్, మోహన్, జయానందం,బి. కుమారి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.