రేపటి నుండే తరగతులు ప్రారంభం: మంత్రి సబితా

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 23, 2021, 05:27 PM
 

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. రేపటి నుండి మార్చి ఒకటవ తేదీలోగా కోవిడ్ -19 నిబంధనలను అనుసరించి ప్రారంభించుకోవాలని అన్నారు. కావున పాఠశాల యాజమాన్యం, సిబ్బంది అందుకు తగిన చర్యలు తీసుకుని, తరగతులు ప్రారంభించాలని సూచించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతులు తప్పనిసరి తీసుకోవాలన్నారు.