జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 23, 2021, 05:46 PM
 

హైదరాబాద్, బీజాపూర్ అంతరాష్ట్ర రహదారిపై మంగళవారం కారు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భోజన్నగడ్డ తండా పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు బీజాపూర్ మండల పరిధిలోని ఏర్పుమళ్ళకి చెందిన మిదింటి చంద్రయ్య(35)గా గుర్తించారు. హైదరాబాదుకు వెళుతున్న కారు, బైకును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించడం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.