తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ఈ నెల 30న పోలింగ్ జరగనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ, మే 2న ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. వరంగల్ నగర్ పరిధిలోని 66 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 65వ డివిజన్ ఎస్టీ మహిళకు కేటాయించారు. వరంగల్ 2వ డివిజన్ ఎస్టీ జనరల్ కు కేటాయించారు. ఎస్సీ మహిళకు 1, 3, 14, 43, 46 డివిజన్లను ఖరారు చేశారు. వరంగల్ ఎస్సీ జనరల్ కు 15, 17, 18, 37, 47, 53 డివిజన్లను కేటాయించారు. వరంగల్ బీసీ జనరల్ 6, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజన్లు ఖరారు చేశారు.