గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. వరంగల్ నగర పరిధిలోని 66 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు కాగా, 65వ డివిజన్ ఎస్టీ మహిళకు, 2వ డివిజన్ ఎస్టీ జనరల్ కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజన్లు ఎస్సీ మహిళలకు, 15, 17, 18, 37, 47, 53 డివిజన్లను ఎస్సీ జనరల్ కు కేటాయించారు. 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజన్లను బీసీ మహిళలకు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజన్లు బీసీ జనరల్‌కు కేటాయించారు. 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63 డివిజన్లను జనరల్ మహిళలకు కేటాయించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. 1, 8 డివిజన్లు ఎస్టీ జనరల్, 32వ డివిజన్ ఎస్టీ మహిళకు కేటాయించారు. 22, 42, 59 డివిజన్లను ఎస్సీ మహిళలకు, 40, 43, 52, 60 డివిజన్లను ఎస్సీ జనరల్ కు, 28, 29, 30, 33, 34, 38. 46, 47, 48, 57 డివిజన్లు బీసీ మహిళలకు, 2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51 డివిజన్లను బీసీ జనరల్ కు, 5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55, 56, 58 డివిజన్లను జనరల్ మహిళలకు, 3, 4, 6, 13, 23, 26, 27, 35, 36, 39, 41. 45. 49. 50 డివిజన్లను జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.