తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ఈ నెల 5వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. సవరించిన అకడమిక్ షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.