హైద‌రాబాద్ జూలో 8 సింహాల‌కు క‌రోనా

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 05:18 PM
 

దేశంలోనే తొలిసారిగా జంతువులకు క‌రోనా సోకింది. హైద‌రాబాద్ లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని 8 ఆసియా సింహాల‌కు క‌రోనా సోకినట్లు నిర్ధార‌ణ అయ్యింది. ప్రస్తుతం వాటి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని జూ అధికారులు తెలిపారు. సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కరోనా లక్షణాలను గమనించిన తర్వాత వాటి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల నిమిత్తం సీసీఎంబీకి పంపారు. మంగళవారం రిపోర్టులు వచ్చాయి. దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నెల 2న నెహ్రూ జూ ప్కార్‌ తో పాటు పలు పార్క్‌ లను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. సింహాలు మహమ్మారి బారినపడడం భారత దేశంలోనే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని ఓ జూలో 8 పులులు, సింహాలకు కరోనా సోకింది. ఆ తర్వాత హాంగాంగ్‌ లో కుక్కలు, పిల్లుల్లో కరోనా వైరస్‌ లక్షణాలను గుర్తించారు.