తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 05:33 PM
 

జమున హ్యాచరీస్ కేసుపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 1,2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని, వెనుక గేట్ నుంచి కాదు.. రాచమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. సరైన పద్దతిలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.