రైల్వే ఉద్యోగి దారుణ హత్య..

  Written by : Suryaa Desk Updated: Sat, May 08, 2021, 12:44 PM
 

మల్కాజిగిరిలోని న్యూ మిర్జాల్ గుడాలో ఎయిర్ కండిషన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ రెడ్డిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కొబ్బరికాయలు కొట్టే కత్తితో మెడ నరికి దారుణంగా హత్య చేశారు. మృతుడు, అతని తల్లి కరోనా పాజిటివ్ బాధితులు కావడంతో తల్లిని రైల్వే హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శ‌నివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి విజయ్ కుమార్ ఇంటికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.