వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 08, 2021, 01:15 PM
 

గ్రేటర్‌ పరిధిలోని వ్యాక్సినేషన్‌ సెంటర్లలో స్లాట్స్‌ దొరకడం లేదు. కాస్త దూరమైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో నగరవాసులు రంగారెడ్డి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో బుక్‌ చేసుకుంటున్నారు. కొన్ని సెంటర్లలోని డాటా ఎంట్రీ ఆపరేటర్ల తీరు ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోజు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తులంతా వ్యాక్సిన్‌ తీసుకోకపోయినా తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆ స్థానంలో పరిచయస్థులకు సూది మందు వేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.