మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన

  Written by : Suryaa Desk Updated: Sat, May 08, 2021, 02:09 PM
 

మహేశ్వరం నియోజకవర్గంలో శనివారం మంత్రి సబితారెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేస్తారు. జల్ పల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరుగనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథులు పాల్గొనాలని మంత్రి క్యాంపు కార్యాలయం నుండి అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.