తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

  Written by : Suryaa Desk Updated: Sat, May 08, 2021, 04:07 PM
 

దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఓ వైపు ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ అంశంపై ఎందుకు? అని ప్రశ్నించింది. ఈ భూములకు సంబంధించిన వివాదం ఎప్పట్నుంచో ఉన్నా ఇప్పుడే ఇంత తొందర ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా వేళ 4 జిల్లాల కలెక్టర్లతో విచారణ చేస్తున్నారని, ఇటువంటి క్లిష్ట సమయంలో నలుగురు అధికారులతో కమిటీని వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. కోర్టు ప్రశ్నలపై స్పందించిన ఏజీ కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయ శాఖను హైకోర్టు ఆదేశించింది.