నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

  Written by : Suryaa Desk Updated: Sat, May 08, 2021, 05:09 PM
 

నిమ్మకాయ‌ల‌తో మ‌న‌కు ఎన్నో ప్రయోజ‌నాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే సుగుణాల‌తోపాటు, అందాన్ని ఇనుమ‌డింప‌జేసే ల‌క్షణాలు కూడా నిమ్మలో ఉన్నాయి. నిమ్మ‌కాయ‌లు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఎండా కాలంలో ఒంట్లో వేడిని త‌గ్గించ‌డానికి తోడ్పడుతాయి. ఇలా నిమ్మకాయలతో ఎన్నో ప్రయోజ‌నాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- నిమ్మర‌సం యాంటీసెప్టిక్‌ గా పనిచేస్తుంది.


- నిమ్మలో కావాల్సినంత‌ 'సి' విటమిన్ ల‌భిస్తుంది.


- త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకున్న వారిలో వృద్ధాప్య చాయ‌లు త్వర‌గా ద‌రిచేర‌వు.


- ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వ‌స్తుంది.


- పంటి నొప్పిని తగ్గించ‌డంలో కూడా నిమ్మర‌సం తోడ్పడుతుంది.


- చిగుళ్లలోంచి ర‌క్తం వ‌చ్చేవారు త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల ప్రయోజ‌నం ఉంటుంది.


- కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొల‌గించి, శుద్ధి చేయ‌డంలో నిమ్మ‌రసం మంచి ఉప‌కారిగా ప‌నిచేస్తుంది.


- వేసవిలో నిమ్మర‌సం తాగితే అల‌స‌ట నుంచి త్వర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


- స్థూల కాయం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.


- నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించ‌డంలో కూడా తోడ్పడుతుంది.