కోవిడ్ టీకా కొరకు స్లాట్ బుక్ చేసుకున్నా సమయానికొచ్చేసరికి రద్దవుతుండటంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ దొరకుతుందో లేదోనంటూ కంగారు పడుతున్నారు. ఈ రోజు నాటికి బుక్ చేసుకున్న స్లాట్ రద్దు అయ్యిందంటూ అనేక మందికి నిన్న సంక్షిప్త సందేశాలు రావడంతో సంబంధితులు అవాక్కయ్యారు. మరోసారి స్లాట్‌బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అన్న దానిపై అధికారులు సమాధానం ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు.