పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌కు రంజాన్ పర్వదినం ఓ ప్రతీక అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మక ఫలితాలను ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.