వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు

  Written by : Suryaa Desk Updated: Sun, May 16, 2021, 03:28 PM
 

మేడ్చల్  జిల్లాలో చైన్ స్నాచర్ లు రెచ్చిపోతున్నారు. రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. దీంతో మహిళలు రోడ్డు మీద తిరగాలంటే జంకుతున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా 6 చైన్ స్నాచింగ్‎లు చేయగా..ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా పోలీసులు చేధించలేదు. దీంతో రోడ్డుపైకి రావాలంటే జవహర్ నగర్ స్త్రీలు,  భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు ఒక్క కేసు కూడా చేధించకపోవడంతో జవహర్ నగర్ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.