వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ

  Written by : Suryaa Desk Updated: Sun, May 16, 2021, 03:42 PM
 

అధికార టీఆర్‌ఎస్‌లో ఈటల వ్యవహారం రోజు రోజుకీ ముదిరుతోంది. టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, ఈటల వర్గీయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా వీణవంకలో టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రసాభాస జరిగింది. ఈటలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రెస్‌మీట్ పెట్టారు. సరిగ్గా ఈ సమయంలోనే ఈటల వర్గీయులు అక్కడికి చేరుకొని, వాగ్వాదానికి దిగారు. దీంతో టీఆర్‌ఎస్ నేతలకు, ఈటల వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. కాసేపటి తర్వాత పోలీసులు ఈటల వర్గీయులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.