ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.!

  Written by : Suryaa Desk Updated: Sun, May 16, 2021, 04:52 PM
 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చీలిక కనిపిస్తోంది. కొందరు నేతలు ఆయనపై సానుభూతి ప్రదర్శిస్తుంటే.. మరికొందరు తమ పార్టీతో సంబంధంలేని నాయకుడిపట్ల సానుకూలత అవసరంలేదని తేల్చిచెబుతున్నారు. దాంతో ఈటల ఏపీసోడ్ హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.ఈటలను కేబినెట్ నుంచి బర్త్‌రఫ్ చేయడంతో ఆయన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పెరుగుతోంది. వివిధ కుల సంఘాల నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. ఆయా సంఘాల నేతలు ఈటలను కలిసి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆయనపట్ల సానుభూతిని చూపుతున్నాయి. సీఎం కేసీఆర్‌పై మాటల దాడి చేస్తూ ఈటలకు మద్దతుగా నిలుస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీజేఎస్ పెద్ద నేతలు ఎవరూ కూడా ఈటలను పల్లెత్తుమాట అనడంలేదు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం నేతల మధ్య చీలిక కనిపిస్తోంది. ఈటల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సానుభూతి చూపిస్తుండగా.. మరికొందరు అంత ప్రేమ అవసరం లేదని అంటున్నారు.