ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైద‌రాబాద్‌లో అర్ధరాత్రి వ్య‌క్తి దారుణ హ‌త్య‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 17, 2021, 09:03 AM

హైదరాబాద్: రాజ‌ధాని నగరంలో ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. నేరేడ్‌మెట్‌‎లోని అనంతనగర్ కాలనీలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్యామ్ సుందర్ అనే వ్య‌క్తిని దుండగుడు హత్య చేశాడు. కాల‌నీకి చెందిన శ్యామ్‌సుంద‌ర్ త‌న ఇంట్లో నిద్రిస్తుండ‌గా.. అర్ధ‌రాత్రి దాటిన‌త‌ర్వాత ఓ వ్యక్తి అత‌ని ఇంటి డోర్ కొట్టడంతో శ్యామ్‌ తలుపు తెరిచాడు. అనంత‌రం ఆ దుండగుడు శ్యామ్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో అదికాస్త పెద్ద‌ద‌య్యింది. ఈ క్ర‌మంలో దుండ‌గుడు నిద్రమత్తులో ఉన్న శ్యామ్‎ త‌ల‌పై సిమెంట్ ఇటుకతో బ‌లంగా కొట్టాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. దీంతో శ్యామ్ తల్లి రేణుక పోలీసుల‌కు ఫిర్యాదుచేశారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com