తెరాస ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 11, 2021, 12:08 PM
 

హైదరాబాద్‌: తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్‌ గ్రూప్‌ సంస్థలు సహా ఐదు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులను సుమారు రూ.వెయ్యి కోట్లకు మోసం చేసినట్లు వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.