ఆగస్ట్ మొదటి వారంలో ఎంసెట్ పరీక్ష..!

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 11, 2021, 12:15 PM
 

ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,20027 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15న ఎసెంట్ దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే ఆగస్ట్ మొదటి వారంలో ఎసెంట్ పరీక్షలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు జరిగే పరీక్షలను ఆగస్ట్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఎసెంట్ గడుపు పెంపుపై రెండు మూడు రోజుల్లో ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోనుంది. ఇంటర్ పరీక్షల రద్దుతో ఎంసెట్ నిర్వాహణపై విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పరీక్షలు ముగిసిన నాటి నుంచి ఎంసెట్ ప్రిపరేషన్‌కు ఆరువారాల గడువు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఎసెంట్ పరీక్ష లేకుండా విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేటాయింపు చేయడం అసాధ్యమని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా పరీక్షల రద్దుతో మెరిట్ స్టూడెంట్లు నష్టపోతారని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ఎంసెట్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మంచిదని అధికార వర్గాలు చెబుతున్నాయి.