షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 11, 2021, 12:40 PM
 

వికారాబాద్: జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద వారు పడుతున్న సమస్యలను రైతులు షర్మిలకు వివరించారు. తేమ శాతం, తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకూ తరుగు తీస్తున్నారని రైతులు షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.