సమాచారం లేకుండా వ్యాక్సిన్ సెంటర్లను మార్చిన జీహెచ్ఎంసీ

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 02:18 PM
 

స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాక్సినేషన్ సెంటర్లను జీహెచ్ఎంసీ అధికారులు మార్చేశారు. దాదాపు పది ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ వ్యాక్సిన్ కేంద్రాలను మార్చేశారు. అయితే ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు బల్దియాకు 15 రోజుల కాంట్రాక్టు ముగియడంతో అధికారులు సెంటర్లను మార్చారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు టీకా కేంద్రానికి వెళ్లేసరికి వ్యాక్సిన్ లేకపోవడంతో అయోమయంలో పడిపోయారు. సెంటర్లను ఎక్కడికి మార్చారో అధికారులు కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.