వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్రవాహనాలు అందిస్తా: కేటీఆర్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 04:26 PM
 

తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్రవాహనాలను అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది. గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా ఆరు అంబులెన్స్​లను విరాళంగా ఇచ్చానన్న కేటీఆర్​. తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు మొత్తంగా 90 అంబులెన్స్​లను విరాళం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన తన జన్మదినం సందర్భంగా అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని కోరారు. అదే రోజున నిర్వహిస్తోన్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులు, అభిమానులకు కేటీఆర్​ పిలుపునిచ్చారు. తన జన్మదినం రోజున బొకేలు, కేకులు, హోర్డింగుల కోసం వృథాగా డబ్బు ఖర్చు చేయవద్దని కేటీఆర్ సూచించారు.