వాతావరణం శాఖ రెయిన్ అలర్ట్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 04:30 PM
 

రాగల 48 గంటల్లో మరిన్ని భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. భారీవర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్ లో ఇప్పటికే భారీవర్షం కురుస్తోంది.