నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4,38,828 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 36,606 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 579.70 అడుగులు ఉంది. సాగర్ పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 282.1472 టీఎంసీలుగా ఉంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.