నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 03:50 PM
 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం సాగర్ ఎడమ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్‌, సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ధర్మానాయక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం వరకు సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో క్రస్ట్‌ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.