సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 06:30 PM
 

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి చైత్ర కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''అందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది.


ఈ దారుణం నన్ను కలచివేసింది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో ఈ ఘటన జరుగడం దారుణం. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. నిందితున్ని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలి'' అని తెలిపారు.