సైదాబాద్ నిందితుడి కోసం ముమ్మరo గా గాలింపు: సీపీ స్టీఫెన్ రవీంద్ర

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 07:46 PM
 

సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటనలో హత్యాచార నిందితుడిని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు రాజుని పట్టుకోవడానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్‌ని ఏర్పాటు చేశామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్టేషన్లు అలర్ట్ అయ్యాయన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మఫ్టీ పోలీసులు, ఎస్వోటి, ఎస్బీ, లోకల్ పోలీసులతో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. ఎవరికైనా నిందితుడు రాజు ఆచూకీ తెలిస్తే డయల్ 100 కి ఫోన్ చేయాలని ప్రజలకు సీపీ విజ్ఞప్తి చేసారు.


బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్లేసులు, టోల్ గేట్స్ వద్ద, లాడ్జీల్లో ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ పోలీసులతో అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు. హ్యూమన్ ఇంటలిజెన్స్ సహాయం తీసుకుంటున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలోని సీసీ కెమెరాల్ని, పుటేజీని పరిశీలిస్తున్నామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు