ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణేష్ నిమజ్జన గూగుల్ రూట్ మ్యాప్ & ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 01:18 PM

వినాయక నిమజ్జానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు పోలీసులు. ఇక, శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధం విధించారు.. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లించారు అధికారులు..


విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.. నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకుంటే.. 040-27852482, 94905 98985, 90103 03626 నెంబర్లకు సంప్రదించవచ్చునని పోలీసులు వెల్లడించారు.. ఇక, గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు..


 


బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మార్గ్‌కు వినాయక విగ్రహాల తరలింపు.


బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్​గంజ్ గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు.


సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు విగ్రహాల మళ్లింపు.


ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు.


దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా శూబాయత్ర.


టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​ వైపు మళ్లింపు


 


ట్రాఫిక్ ఆంక్షలు


 


మేహది పట్నం, తపచ్ బుత్రా అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి. ఈ రూట్ మ్యాప్ లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లానని పోలీసు సూచించారు. ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​కు చేరుకోనుంది. ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించనున్నారు. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ బ్లూ & ఆరెంజ్ & రెడ్& గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్దం చేసారు ట్రాఫిక్ పోలీసులు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com