ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుక్కను వెతికిస్తే 30 వేలు బహుమతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 03:38 PM

ఓ కుక్కను వెతికి పెడితే రూ. 30 వేలను బహుమతిగా ఇస్తామని ఓ కుటుంబం వారు పేపర్ ప్రకటన ఇచ్చారు. వివరాల్లోకి వెళితే. చింతల్‌బస్తీకి చెందిన విష్ణుప్రియ ఓ కుక్కను పెంచుకున్నారు. దానికి డాలి అని పేరు పెట్టుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అయితే వారం రోజులుగా ఆ కుక్క కనిపించకుండా పోయింది. ఆమె చుట్టుపక్కన అంతా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. వారం రోజులు గడిచినా కుక్క ఆచూకీ దొరక్కపోవడంతో మనస్తాపానికి గురైన విష్ణుప్రియ ఓ నిర్ణయానికి వచ్చింది. తమ కుక్కను వెతికిచ్చిన వారికి 30వేలు బహుమతిగా ఇస్తాం అంటూ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com