నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతుండడంతో శనివారం నాలుగు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టకు 84, 309 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో అంతే నీరు దిగువకు విడుదలవుతుంది. సాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589. 40అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను, ప్రస్తుత నీటి నిల్వ 310. 2722 టీఎంసీలుగా ఉంది.