తెలంగాణలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ వచ్చినప్పుడు నుంచి ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తుంది. శుక్రవారం రేవంత్ పెట్టి సభ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ సభ పెట్టిన రోజే ఆయనపై ట్విట్టర్ వేదికగా కోమటిరెడ్డి కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ శశిథరూర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కేటిఆర్ ఈ విషయాన్ని లేవనెత్తి, దానికి సంబంధించిన ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై శశిథరూర్ కూడా సాను కూలంగా స్పందించారు. అంతా సద్దుమణి గిందన్న సమయానికి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 'శశిథరూర్ ఓ గొప్ప నాయకుడు, ఎంతో మందికి ప్రేరణ కలిగించే వ్యక్తిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఓ సీనియర్ కాంగ్రెస్ సభ్యుడైన నాకు తీవ్రంగా బాధకలిగించింది.' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది చర్చనీయంశంగా మారింది.