ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ లో జూనియర్ పంచాయతీ సెక్రటరీ జాబ్స్‌.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 08:33 PM

తెలంగాణలోని పంచాయతీరాజ్ శాఖ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పోర్ట్స్ కోటాలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 10 దరఖాస్తులకు చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తివివరాలను http: //www. tsprrecruitment. in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.


క్రీడార్హతలు: హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ లాంటి క్రీడల్లో రాణించాలి.


వయస్సు: 18 నుంచి 44 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ క్రీమీలేయర్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 800. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులకు రూ. 400.


ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.


వేతనం: రూ. 28, 719.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com