ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్ లైన్ యాప్ లో స్నేహం..దోపిడీ కి పథకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 08:34 PM

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విహారి కాలానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి ఆన్ లైన్ యాప్ ద్వారా ముంబై కి చెందిన రాజ్ కుమార్ రావత్ (27) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఇతను వృత్తి రీత్యా జూనియర్ ఆర్టిస్ట్ అలా వీరి స్నేహం కొద్ది కాలం సాగిన తర్వాత రావత్ ముంబై నుండి హైదరాబాద్ మేడిపల్లి లో ఉన్న బాలకృష్ణ ఇంటికి వచ్చాడు. అతని ఇంట్లో ఉన్న 07 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. దీంతో ఖంగుతిన్న బాలకృష్ణ స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదురు నిందితుడిని అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్ కు తరలించారు. ఎది ఏమైనప్పటికీ ఆన్ లైన్ లో అనముకులతో పరిచయాలు ఏర్పరచుకుని లేని సమస్యలు కొని తెచ్చుకోవద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com