తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షల హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి వెట్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. హాల్ టికెట్లపై పొందుపర్చిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే కాలేజీ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.