అంబేద్కర్ విగ్రహం తీసుకెళ్లి జైల్లో పెట్టారు.. ఇంకా ఇవ్వలేదు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 07:02 PM
 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ మరోసారి అంబేద్కర్ విగ్రహం ఘటన పై స్పందించారు. పంజాగుట్ట దగ్గర  అంబేద్కర్ విగ్రహం పెట్టాలని భావిస్తే దాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. మూడేళ్లయ్యింది ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం ఇవ్వలేదన్నారు.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్‌ సహా ఢిల్లీ పెద్దలకు లేఖలు రాశానని గుర్తుచేశారు. వెంటనే విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టకపోతే డిసెంబర్ 12న జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సరే అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం ఆగదన్నారు.  పంజాగుట్ట దగ్గర అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామన్నారు.