రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు.. సరిహద్దుల్లో నిఘా పెంపు

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 07:08 PM
 

తెలంగాణలో మావోల అలజడి పెరిగింది. ఇటు పోలీసుల కూడా నిఘా పెంచారు. ఈ పరిస్థితుల్లోనే రేపటి  నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మావోయిస్టు ప్రాబల్యమున్నతెలంగాణ-ఛతీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు.రేపటి నుంచి ఈ నెల 8 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరుగుతాయి.  సారపాకలో కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ ఎస్పీలతో డీజీపీ సమావేశమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా సరిహద్దుల్లో నిఘా పెంచాలంటూ సూచించారు. ప్రజాప్రతినిధులు అనుమతి లేకుండా పర్యటించొద్దని పోలీసులు సూచించారు.