త్వరలో కమలం గూటికి మరో ఉద్యమకారుడు..?

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 07:18 PM
 

టీఎన్జీవో మాజీ నాయకుడు.. మాజీ టీఎస్‌పీఎస్సీ సభ్యుడు, ఉద్యమకారుడు విఠల్ త్వరలో కమలం గూటికి చేరనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్సీ సభ్యుడుగా నియామకం అయ్యారు. దీంతో టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న విఠల్ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. దీనితో బీజేపీలో చేరికలు మళ్లీ మొదలయ్యాయి అని అంటున్నారు. టీఆర్ఎస్‌ తొలి ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడిగా విఠల్ పనిచేశారు. వారం రోజుల్లో విఠల్‌ బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.