ధాన్యం కొనకుండా.. గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు?:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 07:33 PM
 

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రైసు మిల్లర్లతో కుమ్మక్కైయాడని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. రోడ్లపై రైతులు పడిగాపులు కాస్తుంటే మంత్రులు ఎక్కడ ఉన్నారు.?  గంగుల కమలాకర్‌  శాఖ పని చేసేదే ఈ ఒక్క నెల అని, ధాన్యం కొనకుండా గంగుల కమలాకర్ కనపడకుండా పోయారు. రైతులు ఇబ్బంది పడుతుంటే గంగుల కమలాకర్‌కు బాధ్యత లేదా? రైతులు నష్టపోతుంటే గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు? అని ప్రశ్నించారు. అధికార పార్టీ మిల్లర్లకు లొంగిపోయిందని, రైతుల పక్షాన నిలబడని గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.