మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 07:39 PM
 

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న శేఖర్ అనే పోలీసు కానిస్టేబుల్ శంకర్‌పల్లిలోని ఆమె ఇంట్లో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై కేసు నమోదు చేశారు.14 ఏళ్ల బాధితురాలి కుటుంబం శంకర్‌పల్లిలోని కానిస్టేబుల్‌ ఇంట్లో అద్దెకు ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శేఖర్ ఆమె వద్దకు వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆదే సమయంలో తిరిగి వచ్చిన ఆమె తల్లి ఇది చూసి అప్రమత్తమైంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శంకర్‌పల్లి పోలీసులు శేఖర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.