ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఆ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 08:36 PM

తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం శుక్రవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలీసు సిబ్బందికి రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం గ్రూప్ 1లో భాగంగా భర్తీ చేయనున్న డీఎస్పీ పోస్టుల అభ్యర్థుల ఎత్తును 165 సెం.మీ.కి తగ్గించింది. తాజాగా శుక్రవారంతో ముగియనున్న పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఉద్యోగాల భర్తీకి సంబంధించి మూడు కీలక నిర్ణయాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.పోలీసు ఉద్యోగాల దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 26 వరకు పొడిగించింది. పోలీసు ఉద్యోగాలకు ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com