తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సెక్యూరిటీ రద్దు చేసారు. ఈమధ్య బండి సంజయ్‌కు కోసం పోలీసులు 1 ప్లస్ 5తో రోప్ టీమ్ ను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ పోలీసులు రోప్ టీమ్‌తో పాటు ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆయనకు పెంచిన భద్రత ఒక్కరోజు మాత్రమే. దీంతో ఒక్కరోజులోనే అదనపు భద్రతను పోలీసులు ఉపసంహరించుకున్నారు. మరోవైపు బండి సంజయ్‌కు భద్రతను ఉపసంహరించుకోవడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.