యువతి అదృశ్య మైన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరి ధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. సీతాఫలండికి చెందిన సిద్ధయ్య ఉస్మానియా క్యాంపస్లో గత నెల నుంచే సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సిద్దయ్యకు కుమార్తె దూదేకుల హాసీనా(21) శనివారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. మధ్యాహ్నం అయినా హాసీనా ఇంటికి చేరుకోక పోవడంతో కంగారు పడిన సిద్ధయ్య చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఫలితం లేకపోవ డంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.