ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా సీఎం ప్రశ్నలకు స్పందించకుండా...పొంతనలేని ప్రకటనలేంటీ: మంత్రి హరీష్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 09:34 PM

తమ ముఖ్యమంత్రి కేసీఆర్ సంథించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నీతి ఆయోగ్ వింత ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నీతి ఆయోగ్ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. నీతి ఆయోగ్ తీరును ఎత్తి చూపిన సీఎం కేసీఆర్ ను తప్పుపడుతూ ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనను ఖండించారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా.. ఏవేవో అంశాలతో ప్రకటన చేయడం ఏమిటని నిలదీశారు. నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకొందని, బీజేపీకి వంతపాడేలా ప్రకటన చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదని.. నిధులిచ్చినా వాడుకోలేదంటూ నీతి ఆయోగ్‌ అనడం ఏమిటని మండిపడ్డారు. నీతి ఆయోగ్ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు ఇవ్వాల్సిందని.. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను సమర్థించడం ఏమిటని నిలదీశారు. 


పెద్దగా పనితనం చూపని, వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఇస్తున్నారని.. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదని హరీశ్ రావు నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధిలో వేగంగా ముందుకెళుతున్న తెలంగాణపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణ కోసం చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి ఎందుకు చెప్పడం లేదని నీతి ఆయోగ్‌ ను ప్రశ్నించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com