మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారని కమిషనర్ వసంత తెలిపారు. ఉదయం 11 గంటలకు పహాడీషరీఫ్ , పహాడీషరీఫ్, 11. 30 గంటలకు కొత్తపేటలో బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నారన్నారు. 12 గంటలకు 3వ వార్డులో డ్రైనేజీ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.