యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి మరో అడ్డంకి ఏర్పడింది. యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులపై మరోసారి అధ్యయనం చేయాలని రాష్ట్ర అటవీశాఖను కేంద్ర పర్యావరణశాఖ ఆదేశించింది. 9 నెలల్లోగా ఈ అధ్యయనాన్ని పూర్తి చేసి తమకు నివేదిక అందజేయాలని కోరింది. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మించ తలపెట్టిన స్థలం అమ్రాబాద్ అభయారణ్యానికి ఎంత దూరంలో ఉంది అనేది నిర్థారించాలని ఆదేశించింది. ఒకవేళ 10 కి.మీ దూరంలోపు ఉంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశించింది.
![]() |
![]() |