జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు భరించలేకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనను అడుగడుగునా సంజయ్ వేధిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఒక బీసీ బిడ్డనైన తాను ఎదుగుతున్నానని దొర అహంకారంతో తనపై కక్షకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులన్నీ అడ్డుకున్నారని... మున్సిపల్ చైర్మన్ పదవిని తనకు నరకప్రాయంగా మార్చారన్నారు.
![]() |
![]() |