టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ముందస్తు రిజర్వేషన్లపై రాయితీలు ప్రకటించారు. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే టికెట్‌పై 5% రాయితీ, 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10% రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఓపీఆర్ ఎస్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.
![]() |
![]() |