జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో శనివారం రోజున గ్రామ భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన నుండి ఇప్పటివరకు జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను తెలియ పరుస్తూ సాధించుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా తీర్చిదిద్దుతున్నారో. అలాగే అలుపెరుగని యోధుడు ధర్మపురి అభివృద్ధి ప్రదాత మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్విరామ కృషి అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు తీసుకెళ్లి పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా. అలాగే తెలంగాణలో లబ్ధి పొందని కుటుంబమే లేదని ఏదో ఒక సంక్షేమ పథకాన్ని తీసుకున్న వారేనని తెలియజేస్తూ. పార్టీ సభ్యులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జాడి లక్ష్మీరాజం, సర్పంచ్ బండారి లచ్చయ్య, ఉపసర్పంచ్ కొంగల సత్యనారాయణరెడ్డి, జాడి మల్లేశం, సిహెచ్ లచ్చయ్య, నందయ్య, రమేష్, చంద్రమౌళి, కనకయ్య, కుమార్ ఉరిమెట్ల శ్యామల, అంతర్పుల నర్సమ్మ , దూడ సుజాత, ఏదుల లక్ష్మి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.